Dhanush | ధనుష్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు.. తండ్రి కస్తూరి రాజా వ్యాఖ్యలతో జోరందుకున్న చర్చ!
Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు ప్రస్తుతం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా తనదైన ముద్ర వేసిన ధనుష్ రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశాలపై తాజాగా ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు ప్రస్తుతం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా తనదైన ముద్ర వేసిన ధనుష్ రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశాలపై తాజాగా ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి రాజాను మీడియా ప్రతినిధులు ధనుష్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాల గురించి ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన, రాజకీయాల్లోకి రావడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ధనుష్ అయినా, తన మరో కుమారుడు సెలవ్వరాఘవన్ అయినా రాజకీయాల్లోకి రావచ్చని, అలాంటి నిర్ణయాన్ని తాము నిరాకరించే స్థితిలో లేమని వ్యాఖ్యానించారు.
అలాగే తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడూ కొత్త నాయకత్వాన్ని స్వాగతిస్తాయని పేర్కొంటూ, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న మార్పులను ప్రస్తావించారు. తాను మాత్రం వయస్సు కారణంగా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే తన పిల్లలు లేదా మనవళ్లు భవిష్యత్తులో ప్రజాసేవ వైపు అడుగులు వేయొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కస్తూరి రాజా తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో చెన్నై చేరుకున్నానని, కుటుంబ సహకారం వల్లే సినీ పరిశ్రమలో నిలదొక్కుకోగలిగానని తెలిపారు. ముఖ్యంగా తన భార్య విజయలక్ష్మి ప్రోత్సాహమే తన విజయానికి ప్రధాన కారణమని చెప్పారు.
పెద్ద కుమారుడు సెల్వరాఘవన్ మొదట సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు ముందుగా చదువు పూర్తి చేయాలని సూచించానని, ఆ తర్వాత ఆయన గోల్డ్ మెడల్ సాధించి దర్శకుడిగా ఎదిగారని గర్వంగా చెప్పారు. ప్రస్తుతం తమ కుమార్తెలు వైద్య రంగంలో విజయవంతంగా కొనసాగుతున్నారని వెల్లడించారు.ఇక ధనుష్ విషయానికి వస్తే, ఆయన చాలా కాలంగా అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాల్లో పేదలకు సహాయం చేయడం, విద్యార్థులకు మద్దతు అందించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన విజయ్ రాజకీయ ప్రయాణం కూడా సినీ రంగం నుంచే ప్రారంభమైన నేపథ్యంలో, ధనుష్ పేరు కూడా రాజకీయ చర్చల్లో వినిపించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటివరకు ధనుష్ స్వయంగా రాజకీయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

