Ramam Raghavam | వాలంటైన్స్ డే స్పెషల్.. రామం రాఘవం ఎమోషనల్ గ్లింప్స్ రిలీజ్
Ramam Raghavam | ఇన్నిరోజులు కమెడియన్‌గా అలరించిన ధన్‌రాజ్ ఇప్పుడు దర్శకుడిగా మారాడు. కోలీవుడ్ దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో రామం రాఘవం టైటిల్‌తో ఓ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
Ramam Raghavam | ఇన్నిరోజులు కమెడియన్‌గా అలరించిన ధన్‌రాజ్ ఇప్పుడు దర్శకుడిగా మారాడు. కోలీవుడ్ దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో రామం రాఘవం టైటిల్‌తో ఓ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తండ్రీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా రామం రాఘవం చిత్ర గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని తన ట్విట్టర్(ఎక్స్) ఖాతా ద్వారా ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ మీడియా గ్లింప్స్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధనరాజ్ నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ.. ఒక మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో రామం రాఘవం సినిమాను తీశారని అన్నారు. ఈ గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా ఉందని, ఎమోషనల్ జర్నీ తో రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రేమికుల రోజున తండ్రీకొడుకుల మధ్య ఉన్న బాండింగ్‌ను కండ్లకు కట్టినట్లు చిత్రీకరించిన గ్లిమ్స్ విడుదల చేయడం కొత్తగా ఉందని అభిప్రాయపడ్డారు.
తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో వస్తున్న ఈ సినిమాలో తండ్రిగా సముద్రఖని, కొడుకుగా ధన్‌రాజ్ నటిస్తున్నారు. మోక్ష, హరీశ్ ఉత్తమన్, సత్య, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామం రాఘవం సినిమాను స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వీ పొలవరపు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. ఇందులోని పాటలను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు. హైదరాబాద్, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ‘రామం రాఘవం’ తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

