Dhamaka Movie | మాస్‌రాజా రవితేజ ప్రస్తుతం ఒక మాస్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘క్రాక్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ‘ఖిలాడీ’, ‘రామా రావు ఆన్ డ్యూటీ’లు వరుసగా ఫ్లాప్ అవడంతో రవితేజ కాస్త నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ధమాకా’ సినిమాపైనే ఉన్నాయి. త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్23న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్‌కు భారీ ధర పలికినట్లు సమాచారం. ధమాకా చిత్రానికి దాదాపు రూ.30 కోట్ల వరకు నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు పడినా రవితేజ సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ జరగడం అంటే విశేషం అనే చెప్పాలి. కేవలం ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులే రూ.10 కోట్ల ధర పలికాయట. కాగా ఈ సినిమాను పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ సంస్థలు నిర్మించనుడంతో హిందీ డబ్బింగ్ హక్కులకు అంత రేటు పలికాయట. ఇక డిజిటల్, శాటిలైట్ హక్కులు అన్ని కలుపుకొని మరో రూ.20 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్లు టాక్. ఈ సినిమా రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో రూపొందింది. రవితేజకు జోడీగా పెళ్ళి సందడి ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో బాణీలు సమకూర్చాడు.