Dhadak 2 | బాలీవుడ్ నుంచి క్రేజీ సీక్వెల్.. విడుదల తేదీ ప్రకటించిన ‘ధడక్ 2’
Dhadak 2 | భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.
Dhadak 2 | భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని చిత్రాలు విడుదల కాకముందే సెకండ్ పార్ట్ ఉంటుందని ప్రకటించగా, మరికొన్ని ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సీక్వెల్స్ తీస్తున్నాయి. అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో మూవీ వచ్చి చేరింది. 2016లో మరాఠీ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రం సైరట్ (Sairat). ఈ సినిమా మరాఠీలోనే దాదాపు రూ.100 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇక ఇదే సినిమాను బాలీవుడ్లో ధడక్ (Dhadak) పేరుతో రీమేక్ చేశారు. ఇషాన్ ఖట్టర్ మరియు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటీనటులుగా వచ్చిన ఈ చిత్రం హిందీలో కూడా మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ప్రకటించింది.
ధడక్ 2 అంటూ రాబోతున్న ఈ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది(Siddhant Chaturvedi), యానిమల్ భామ త్రిప్తి డిమ్రి(Tripthi Dimri) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు షాజియా ఇక్బాల్ (Shazia Iqbal) దర్శకత్వం వహించబోతుండగా.. ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ & క్లౌడ్ 9 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదల తేదీతో పాటు ట్రైలర్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేయబోతుండగా.. సినిమాను ఆగష్టు 01న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఒకప్పుడు ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. వారు వేర్వేరు కులాలకు చెందినవారు, వారి కథ ముగిసింది. అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుంది.
Do dil. Ek Dhadak.#Dhadak2 trailer out this Friday.
Releasing in cinemas on 1st August. pic.twitter.com/lcuEKRaxMJ
— Dharma Productions (@DharmaMovies) July 9, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

