Dhadak 2 Trailer | సమాజం అంగీకరించని ప్రేమ.. ఆసక్తికరంగా ‘ధడక్ 2’ ట్రైలర్
Dhadak 2 Trailer | బాలీవుడ్ నుంచి వస్తున్న మరో క్రేజీ సీక్వెల్ ధడక్ (Dhadak) 2.
Dhadak 2 | బాలీవుడ్ నుంచి వస్తున్న మరో క్రేజీ సీక్వెల్ ధడక్ (Dhadak) 2. 2016లో మరాఠీ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రం సైరట్ (Sairat). ఇదే సినిమాను బాలీవుడ్లో ధడక్ (Dhadak) పేరుతో రీమేక్ చేశారు. ఇషాన్ ఖట్టర్ మరియు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటీనటులుగా వచ్చిన ఈ చిత్రం హిందీలో మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమాకు ధడక్ 2 అంటూ సీక్వెల్‌ను తీసుకువస్తున్నారు మేకర్స్.
ఈ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది(Siddhant Chaturvedi), యానిమల్ భామ త్రిప్తి డిమ్రి(Tripthi Dimri) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు షాజియా ఇక్బాల్ (Shazia Iqbal) దర్శకత్వం వహించబోతుండగా.. ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ & క్లౌడ్ 9 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 01న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ట్రైలర్ చూస్తుంటే.. ఈ చిత్రం నిలేష్ (సిద్ధాంత్ చతుర్వేది) విధి (త్రిప్తి డిమ్రీ) అనే ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. నిలేష్ అనే అణగారిన కులానికి చెందిన యువకుడు లా చదువుదామని న్యాయ కళాశాలలో జాయిన్ అవ్వగా.. అతడికి విధి అనే ఉన్నత కులానికి చెందిన యువతి పరిచయమవుతుంది. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారాగా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఈ సినిమా కథ. చూస్తుంటే.. తమిళ చిత్రం ‘పరియేరుమ్ పెరుమాళ్’కి రీమేక్‌గా ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్‌ను మీరు చూసేయండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

