కొత్త కాన్సెప్ట్లకే ప్రాధాన్యతనిస్తా!
కథాంశాల ఎంపికలో కొత్తదనానికి పెద్దపీట వేస్తారు అగ్ర హీరో కల్యాణ్‌రామ్. జయాపజయాలకు అతీతంగా విభిన్నమైన కాన్సెప్ట్‌లను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు.
కథాంశాల ఎంపికలో కొత్తదనానికి పెద్దపీట వేస్తారు అగ్ర హీరో కల్యాణ్‌రామ్. జయాపజయాలకు అతీతంగా విభిన్నమైన కాన్సెప్ట్‌లను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు. ఆయన కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం ‘డెవిల్ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం కల్యాణ్‌రామ్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
తొలుత ఈ కథ విన్నప్పుడు 1940 నేపథ్యం చాలా కొత్తగా అనిపించింది. షెర్లాక్ హోమ్స్ సినిమాల తరహాలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశమిది. హీరో బేసిక్ క్యారెక్టరైజేషన్, బ్యాక్‌డ్రాప్ అలాగే ఉంచి కమర్షియల్ పంథాలో స్క్రిప్ట్‌లో మార్పులు చేయమని రచయిత శ్రీకాంత్ విస్సాకు సూచనలు చేశాను. చెప్పినట్లుగానే ఆయన స్క్రిప్ట్‌పై వర్క్ చేసి వాణిజ్య పంథాలో తీర్చిదిద్దారు. ఈ సినిమా మేకింగ్‌కు ఏడాది సమయం పట్టింది.
కమర్షియల్ గూఢచారి
కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ఒక్కోసారి వాటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ లోపించడం వల్ల మిస్‌ఫైర్ అవుతుంటాయి. ‘అమిగోస్’ సినిమా విషయంలో అదే జరిగింది. ఆ కథను చెప్పే క్రమంలో కొన్ని వాణిజ్య అంశాలు మిస్ అయ్యాయి. అందుకే ‘డెవిల్’ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందించాం. నా క్యారెక్టర్లో భారతీయత కనిపిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన గూఢచారి కథల్లో ఇదొక వైవిధ్యమైన కథ.
దేశభక్తి అంశం ప్రధానంగా..
నా పాత్రలో ఎలాంటి నెగెటివ్ అంశాలు కనిపించవు. ప్రతీ విషయాన్ని డీటెయిల్డ్‌గా వర్క్ చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశాం. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. హీరోయిన్లు సంయక్తా మీనన్, మాళవికా నాయర్ పాత్రలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. క్యారెక్టర్స్ విషయంలో నేను ప్రత్యేకమైన కసరత్తులు ఏమీ చేయను. క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తే డైలాగ్ డెలివరీ మొదలుకొని, నటించే పద్దతి వరకు అన్నీ మారిపోతాయి. ఈ సినిమాలో దేశభక్తి అంశం ప్రధానంగా ఉంటుంది. అదేమిటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్రతీ విషయంలో పరిణితి వచ్చింది
మేము చేసే సినిమాలు గొప్పగా ఉండాలని నేను, తారక్ అనుకుంటాం. సినిమా అవుట్‌పుట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. తారక్ ‘దేవర’ విషయంలో గ్రేట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. నటుడిగా ఇరవై ఏండ్ల ప్రయాణం పూర్తయింది. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నా. తండ్రిగా, భర్తగా, నటుడిగా కూడా గొప్ప పరిణితి సాధించానని భావిస్తున్నా. ‘డెవిల్’ సినిమాకు వచ్చే రెస్పాన్స్ చూసిన తర్వాత సీక్వెల్ గురించి ఆలోచిస్తాం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

