ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్గ్లింప్స్కు మంచి స్పందన లభించింది. ఎర్ర సముద్రం నేపథ్యంలోని పోరాట ఘట్టాలు హైలైట్‌గా నిలిచాయి. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ముందే ప్రకటించిన తేదీకి సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవని వార్తలు ప్రచారం అవుతున్నాయి. వీటిపై ‘దేవర’ చిత్ర బృందం స్పందించింది.
సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని, అనుకున్న సమయానికి ‘దేవర’ వస్తున్నాడని వెల్లడించింది. ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్ స్వరకర్త.