Devara Movie | నందమూరి ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ఆడియెన్స్ సైతం దేవరపై ఓ రేంజ్లో అంచనాలు పెంచుకున్నారు. దానికి తోడు మరో వైపు పలు లీకుల ప్రవాహంతో సినిమాపై అంతకంతకూ హైప్ పెరుగుతూనే ఉంది. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటివరకు మనం చూడని యాక్షన్ సీన్లను దేవర టీమ్ డిజైన్ చేస్తుందట. తారక్ సైతం వాటికోసం ప్రత్యేకించి శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ఇక అండర్ వాటర్ సీన్ అయితే మరో అద్భుతమట. సిల్వర్ స్క్రీన్‌పై ఆ సన్నివేశం చూసినప్పుడు సీట్లలో ఒక్కరు కూడా కూర్చోరట. ఇలాంటి లీకులు నందమూరి అభిమానుల్లోనే కాదు సగటు ఆడియెన్స్‌లో సైతం అంతులేని అంచనాలు నెలకొల్పుతున్నాయి.
ప్రస్తుతం ఎడతెరపు లేకుండా ఈ సినిమా షూటింగ్‌ను కొనసాగిస్తున్నారట. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూ్ల్స్ను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ అదే స్పీడ్‌తో ముందుకు కదులుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో లీక్ నెట్టింట దుమారం రేపుతుంది. కాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ రేటుకు దక్కించుకుందట. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా హక్కులు రూ. 90 కోట్లుకు అమ్ముడయ్యాయట. నిజానికి ఇది చాలా పెద్ద నెంబరే. కేవలం స్ట్రీమింగ్ రైట్స్‌కే ఈ రేంజ్లో ధర పలికిందంటే విశేషమనే చెప్పాలి. ఇక ఆడియో రైట్స్ కూడా టీ సిరీస్ సంస్థ భారీ రేటుకు దక్కించుకున్నట్లు టాక్.
సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంది. జాన్వీకి సంబంధించిన కీలక ఎపిసోడ్ షూట్ ఈ నెలాఖరులో మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తుందట. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ దేవరతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు.