Devara Movie | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ (Koratala Shiva) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర’(Devara). జాన్వీకపూర్ (Janvi kapoor) కథనాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చిది. ఇదిలావుంటే.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు. ఎప్పుడెప్పుడా? అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ‘దేవర’(Devara) గ్లింప్స్‌ను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
79 సెకన్లు ఉన్న ఈ గ్లింప్స్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో సాగింది. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ మాస్ అవతార్‌లో కనిపించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక వీడియో చివరిలో తారక్ చేప్పే.. ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది.. అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారుస అనే డైలాగ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.