Devara Movie | ఎన్టీఆర్ (NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవర’(Devara). రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తొలిభాగం 2024 ఏప్రిల్ 5న వస్తుంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అభివృద్ధి చెందని ఓ తీర ప్రాంత నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. తమకు భయం తెలియదంటూ విర్రవీగే వారికి భయాన్ని పరిచయం చేసే పవర్ఫుల్ పాత్రలో తారక్ కనిపించనున్నారు.
ఈ చిత్రంలో యాక్షన్ కి చాలా ప్రాధాన్యత వుంది.. ప్రస్తుతం గోవాలో కొన్ని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఇందులోని యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ పని చేస్తున్నారు. గోవాలో షూట్ పూర్తి కాగానే మూవీ యూనిట్ గోకర్ణ (Gokarna) షిప్ట్ కానుంది. అక్కడ భారీ సెట్ వేసి కొన్ని సన్నివేశాలు తీయనున్నారు. ఇక చిత్రబృందం ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లతో ‘దేవర’ పై అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ (Janvi kapoor) తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.