Brahmastra Movie | విజువల్స్‌తో ఆకట్టుకుంటున్న ‘బ్రహ్మస్త్ర’ సాంగ్ టీజర్..!
Deva Deva Song Teaser | బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రహ్మస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో బ్రహ్మస్త్రం పేరుతో విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి విడుదల చేస్తున్నాడు. నాగార్జున కీలకపాత్రలో నటించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లను జరుపుకుంటుంది. ఫాంటసీ అడ్వేంచర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తుంది. మేకర్స్ మరో అప్డేట్ను ప్రకటించారు.
ఈ చిత్రంలోని ‘దేవ దేవ’ అంటూ సాగే పాట టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన టీజర్ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఈ పాట ఫుల్ లిరికల్ సాంగ్ ఆగస్ట్ 5న విడుదల కానుంది. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన ‘కుంకుమల’ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కనుంది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. బిగ్‌బీ అమితాబ్, నాగార్జున కీలకపాత్రల్లో నటించగా మౌనీరాయ్ విలన్ పాత్రలో నటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

