Deva Deva Song Released | బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రహ్మస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఫాంటసీ అడ్వేంచర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ట్ చేసింది.
ప్రమోషన్లో భాగంగా మేకర్స్ తాజాగా ఈ చిత్రంలోని ‘దేవ దేవ’ సాంగ్‌ను విడుదల చేశారు. ‘గురుజీ ఈ అస్త్రాల ప్రపంచంతో నా జీవితం ఎందుకు ముడిపడి ఉంది’. ‘ఎందుకుంటే, నువ్వు కూడా అస్త్రానివి.. బ్రహ్మస్త్రావి’ అంటూ డైలాగ్‌తో ఈ పాట మొదలైంది. ఈ సాంగ్‌లో విజువల్స్ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ప్రీతమ్ స్వరపరిచిన ఈ పాటను చంద్రబోస్ రచించగా.. శ్రీరామ చంద్ర, జోనితా గాంధి ఆలపించారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ‘కుంకుమల’ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
‘బ్రహ్మస్త్ర’ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కనుంది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. బిగ్‌బీ అమితాబ్, అక్కినేని నాగార్జున కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మౌనీరాయ్ విలన్ పాత్రలో నటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.