Deputy CM Pawan Kalyan | అడవులను నరికివేయడం ఇప్పుడు హీరోయిజం అయిపోయింది : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Deputy CM Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై నేడు కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
Deputy CM Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై నేడు కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశంకు ముందు జరిగిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వస్తున్న సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో అడవులను నరికివేస్తున్నారని అన్నారు.
నాకు చాలా నచ్చింది ఏంటి అంటే దివంగత కన్నడ నటుడు రాజ్ కుమార్ నటించిన చిత్రం గంధడగుడి. ఈ సినిమా థీమ్ ఏంటి అంటే అడవులను కాపాడడం. నాకు కూడా ఇలాంటి సినిమాల్లో నటించాలా అనిపించేది. ఇంతకుముందు సినిమాల్లో హీరోలు అడవులని కాపాడేవారు. కానీ ఈరోజుల్లో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం అడవులను నరికివేయడం హీరోయిజం అయిపోయింది. నేను ఆ పరిశ్రమలో ఉన్నానని అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంటుంది. ఇలాంటివి తగ్గి మళ్లీ అడవుల ప్రాముఖ్యత తెలిసేలా సినిమాలు రావాలని పవన్ కళ్యాణ్ చెప్పారు.
అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ను ఉద్దేశించి చేసినవే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం అడవులను నరికివేయడం లాంటివి ఉండడంతో కావాలని వ్యాఖ్యలు చేస్తున్నాడని అల్లు ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
Also read..
- Paris Olymipics 2024 | జావెలిన్ పసిడి పోరు.. నీరజ్ చోప్రాకు పోటీగా పాకిస్థాన్ అథ్లెట్
- TG Weather | ఈ జిల్లాల్లో రెండురోజులు వానలు.. హెచ్చరించిన ఐఎండీ హైదరాబాద్
- Sheikh Hasina | భారత్‌ను వీడిన షేక్ హసీనా టీమ్.. తెలియని ప్రదేశానికి పయనం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

