ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘సలార్’ చిత్రం వాయిదా పడనుందనే వార్తలు శుక్రవారం సోషల్‌మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. గ్రాఫిక్స్ వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు మరింత సమయం పట్టొచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి.దాంతో సినిమా రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే ఇవి కేవలం సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమేనని, వీటిలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. జగపతిబాబు, శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.