Next Friday Releases | టాలీవుడ్లో విడుదలలు జోరందుకున్నాయి. ఈ శుక్రవారం దాదాపుగా నాలుగు సినిమాలు విడుదల కాగా, వచ్చే శుక్రవారం అంటే డిసెంబరు 9న స్ట్రయిట్ అండ్ డబ్బింగ్‌లు కలుపుకుని దాదాపు 14 తెలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇందులో ఎక్కువగా నూతన తారలతో నిర్మించిన కొత్త చిత్రాలు ఎక్కువగా వున్నాయి. ఈ లిస్ట్‌లో సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’, కలర్స్ స్వాతి నటించిన ‘పంచతంత్రం, విశ్వక్సేన్ అతిథి పాత్రలో కనిపించిన ‘ముఖచిత్రం’తో పాటు వీఆర్ఎల్ అధినేత విజయసంకేశ్వర్ బయోపిక్‌గా రూపొందిన పాన్ఇండియా చిత్రం ‘విజయానంద్’ కూడా వుంది. డిసెంబరు 9న విడుదల కాబోతున్న చిత్రాల జాబితా ఇది.
‘ఏపీ 04 రామాపురం’, ‘చెప్పాలని వుంది’. ‘గుర్తుందా శీతాకాలం’, ‘లెహరాయి’, ‘ముఖచిత్రం’, ‘నమస్తే సేట్జీ’, ‘పంచతంత్రం’, ‘ప్రేమదేశం’, ‘రాజయోగం’, ‘విజయానంద్’, ‘డాక్టర్ 56’, ‘ఆక్రోశం’, ‘ఐలవ్యూ మై ఇడియట్’, ‘లైఫ్ ఈజ్ గుడ్’ ఈ చిత్రంతో పాటు మరో నాలుగు హిందీ చిత్రాలు కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.