ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప ఫీవరే. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. సామీ సామీ పాట, ఊ అంటావా పాట, శ్రీవల్లి పాట అయితే సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నారు. ముఖ్యంగా శ్రీవల్లి పాటలోని హూక్ స్టెప్‌ను చాలామంది ఇమిటేట్ చేశారు.
అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా శ్రీవల్లి హూక్ స్టెప్ వేసి అదరగొట్టేశాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు డేవిడ్. ఆ వీడియోను చూసిన పుష్ప హీరో అల్లు అర్జున్ స్మైలీ, ఫైర్ ఎమోజీలతో ఆ వీడియోకు రిప్లయి ఇచ్చాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపుతోంది. డేవిడ్ వార్నర్ హూక్ స్టెప్ అదరగొట్టేశాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.