Dasara Movie Silk Bar Scene | దసరాతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. చిన్న, పెద్ద, ముసలి, ముతక అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు సినిమాను చూడడానికి ఎగబడిపోతున్నారు. సినిమా రిలీజై రెండు వారాలు దాటినా.. పోటీగా సాలిడ్ సినిమా లేకపోవడంతో మూడో వారం కూడా దసరా దూసుకెళ్తుంది. బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. థియేటర్లలో టిక్కెట్లు భారీ స్థాయిలో తెగుతూనే ఉన్నాయి. దసరా స్పీడ్ చూస్తుంటే మరో వారం సాలిడ్ కలెక్షన్లు రాబట్టే అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక సినిమాపై మరింత హైప్ పెంచడానికి చిత్రబృందం దసరాకు సంబంధించిన పలు వీడియోలను రిలీజ్ చేస్తుంది. తాజాగా ఈ సినిమాలోని సిల్క్ బార్ వీడియోను రిలీజ్ చేసింది.
దసరా సినిమాలో సిల్క్ బార్ అంటే పెద్ద కులం వాళ్లకే.. వాళ్లకు మాత్రమే బార్లోకి ఎంట్రీ ఉంటుంది. మిగిలిన వారందరూ బయట కూర్చోనే తాగాలి. అలాంటిది సూరితో బార్లో వేరే వాళ్లు గొడవకు దిగుతుంటే అది చూసి నాని.. సిల్క్ బార్లోకి ప్రవేశిస్తాడు. అప్పటివరకు బార్ బయటే ఉండి దండాలు పెట్టే నాని ఒక్కసారికి బార్లోకి ఎంట్రీ ఇవ్వడం చూసి అందరూ ఒక్క సారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత ప్రత్యుర్థులపై నాని దాడి చేస్తాడు. ఈ సీన్‌కు థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లిపోయాయి. నాని అలా సిగరెట్ వెలగించుకుని నడుచుకుంటూ వస్తుంటే వెనకాలా సంతోష్ నారాయణ్ బ్యాగ్డ్రౌండ్ మ్యూజిక్కు సీట్లో కూర్చున్న ప్రతీ ఒక్కరికి గూస్బంప్స్ వచ్చాయి. సినిమాలో కీలకమైన సీన్‌ను రిలీజ్ చేయడంతో మరింత జనాలు థియేటర్లోకి వెళ్లే చాన్స్ ఎంతైనా ఉంది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటించగా.. కీర్తి వెన్నెల పాత్ర పోషించింది. ఇక కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి సూరిగా కనిపించాడు. శ్రీకాంత్ ఓదెలా దర్వకత్వ ప్రతిభను మెచ్చుకోని వారుండరు. తొలిసినిమాకే ఈ రేంజ్ అవుట్ పుట్ ఇచ్చాడంటే మాములు విషయం కాదు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించాడు.