Dasara Movie | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న దసరా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Dasara Movie On OTT | దసరా రిలీజై రెండు వారాలు దాటినా ఇంకా దీని జోరు తగ్గడం లేదు. పైగా దసరా తర్వాత రిలీజైన సినిమాలన్నీ వరుసగా పెవీలియన్ బాట పట్టడంతో ప్రేక్షకులకు దసరాకు మించిన ఆప్షన్ ఏది కనబడటం లేదు. ఈ అవకాశాన్ని దసరా సద్వినియోగం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు సాలిడ్గానే ఉన్నాయి.
Dasara Movie On OTT | దసరా రిలీజై రెండు వారాలు దాటినా ఇంకా జోరు తగ్గడం లేదు. పైగా దసరా తర్వాత రిలీజైన సినిమాలన్నీ వరుసగా పెవీలియన్ బాట పట్టడంతో ప్రేక్షకులకు ఈ సినిమాకు మించిన ఆప్షన్ మరోటి కనబడటం లేదు. ఈ అవకాశాన్ని దసరా మూవీ పూర్తిగా వినియోగించుకుంటుంది. ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు సాలిడ్గానే ఉన్నాయి. నానికి ఈ సినిమాతో మాస్ ఆడియెన్స్ నుంచి ఫుల్ యాక్సెప్టెన్స్ దొరికేసింది. ఎన్నో ఏళ్లుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నానికి దసరా అలాంటి విజయాన్నే అందించింది. ఈ సినిమాతో నాని వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు. ఇక దర్శకుడు శ్రీకాంత్ టేకింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తొలి సినిమాకే ఈ రేంజ్ అవుట్ పుట్ ఇచ్చాడంటే మాములు విషయం కాదు.
ఇక ఇదిలా ఉంటే ఓటీటీ ప్రియులు ఈ సినిమా డిజిటల్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించిన డేట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక దసరా సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా ఏప్రిల్ 27 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ మంచి రన్ కొనసాగిస్తున్న దసరాను ఇలా ఓటీటీలోకి తీసుకురావడంపై నిర్మాతల ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. అయితే ముందుగా డీల్ కుదిరించుకున్న ప్రకారమే ఈ సినిమాను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వినికిడి.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన దసరా ఇప్పటివరకు రూ.120 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్లో 2మిలియన్ డాలర్ మార్క్‌ను ఎప్పుడో దాటేసింది. ఈ సినిమాలో నాని ధరణి పాత్ర పోషించగా.. కీర్తి వెన్నెలగా నటిచింది. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి సూరి పాత్రలో మెరిసాడు. సముద్రఖని, సాయికుమార్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో షైన్ టామ్‌చాకో ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. విలేజ్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

