Dasara First Look Poster | విభిన్న తరహా కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు నాచ్యురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నాని అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయం సాధించడంతో నాని ఇప్పటివరకు వెనకకు తిరిగి చూసుకోలేదు. తన సహజ నటనతో ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం ఈయన ‘దసరా’ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి నాని ఫస్ట్‌లుక్ విడుదలైంది.
పోస్టర్లో నాని రగ్గుడ్ లుక్‌లో లుంగీకీ రెండు మందు సీసాలను తగిలించి, మెడలో ఆంజనేయుడి లాకెట్‌తో మంటలోనుంచి సిగిరెట్‌ను వెలిగిస్తూ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. నాని తన ఇమేజ్‌కు భిన్నంగా డీ గ్లామర్ పాత్రలో ఈ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ పోస్టర్‌ను గమనిస్తే నాని ఎవరితోనో గొడవపడే సన్నివేశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ పోస్టర్‌తో సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. నానికి జోడిగా కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తుంది. సింగరేణిలోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో అన్ని ముఖ్య మైన భాషలలో విడుదల చేయనున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
గతేడాది డిసెంబర్లో విడుదలైనా’ శ్యామ్ సింగ రాయ్’ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించింది. నాని అదే జోరుతో ‘అంటే సుందరానికీ’ చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేశాడు. వివేక్ ఆత్రేయా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలైన నాని గ్లింప్స్, ప్రేయర్ ఆప్ లీలా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Dharani from #DASARA
RAGE IS REAL 🔥#SparkofDasara 👇🏼https://t.co/06QUaXXGyb pic.twitter.com/82ITCb0jRY— Nani (@NameisNani) March 20, 2022