Darling | ‘డార్లింగ్’ రీ రిలీజ్ సెన్సేషన్.. ప్రభాస్ క్లాసిక్‌కు థియేటర్లలో సందడే సందడి
Darling | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన డార్లింగ్ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది. 2010లో విడుదలై ప్రేమ కథగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, ఇప్పుడు 4K క్వాలిటీతో రీ రిలీజ్ కావడంతో మరోసారి ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.ఈ రీ రిలీజ్‌కు మొదటి రోజే అద్భుతమైన స్పందన లభించింది.
Darling | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన డార్లింగ్ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది. 2010లో విడుదలై ప్రేమ కథగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, ఇప్పుడు 4K క్వాలిటీతో రీ రిలీజ్ కావడంతో మరోసారి ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.ఈ రీ రిలీజ్‌కు మొదటి రోజే అద్భుతమైన స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.7.5 కోట్ల వసూళ్లు సాధించి, రీ రిలీజ్ సినిమాల్లోనే భారీ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా బాహుబలి: ది బిగినింగ్ తర్వాత ఎక్కువ ఓపెనింగ్ రాబట్టిన తెలుగు రీ రిలీజ్ చిత్రంగా ‘డార్లింగ్’ ప్రత్యేక స్థానం సంపాదించింది.
మొదట 2010 ఏప్రిల్ 23న విడుదలైన ఈ చిత్రం, అదే తేదీ టార్గెట్‌గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే కలెక్షన్లు ఊపందుకోవడంతో సినిమా విజయవంతంగా ముందుకు సాగుతుందనే సంకేతాలు కనిపించాయి. వీకెండ్లో కూడా ఈ జోరు కొనసాగింది. మూడో రోజుకే ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా ‘డార్లింగ్’ రికార్డులు సృష్టించింది. టికెట్లు అమ్మకాలు ప్రారంభమైన వెంటనే భారీగా స్పందన లభించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గంటల వ్యవధిలోనే 25 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడం సినిమా క్రేజ్‌ను స్పష్టంగా చూపించింది. ఇటీవల రీ రిలీజ్ అయిన గబ్బర్ సింగ్, ఖలేజా వంటి చిత్రాల కంటే ‘డార్లింగ్’ మెరుగైన వసూళ్లు సాధించడం గమనార్హం. అలాగే అతడు, బిజినెస్‌మ్యాన్ సినిమాల రికార్డులను కూడా అధిగమించింది.
కథ పరంగా చూస్తే, ‘డార్లింగ్’లో ప్రభాస్ ఓ సరదా స్వభావం కలిగిన యువకుడిగా, మ్యూజీషియన్‌గా కనిపిస్తాడు. చిన్ననాటి స్నేహితురాలు నందినిని మళ్లీ కలుసుకుని ఆమెను తిరిగి గెలుచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం మేళవించిన ఈ సినిమా నేటి ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. ‘డార్లింగ్’ రీ రిలీజ్ సక్సెస్ మరోసారి క్లాసిక్ సినిమాల క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. పాత హిట్ చిత్రాలు మంచి క్వాలిటీతో మళ్లీ విడుదలైతే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో ఈ సినిమా స్పష్టంగా చూపించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

