ఓ వ్యక్తి నా వెంటపడి వేధించాడు.. నన్ను కొట్టాడు: దంగల్ నటి ఎమోషనల్
దంగల్ నటి ఫాతిమా | తనపై సినిమా ఇండస్ట్రీలోని వేధింపులతో పాటు తనపై బయట జరిగిన దాడి గురించి కూడా గుర్తు చేసుకుంది.

సినిమా ఇండస్ట్రీ గురించి.. ఇక్కడ జరిగే అవమానాలు, అరాచకాల గురించి ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ముందుకొచ్చి మాట్లాడారు. తమకు జరిగిన చేదు సంఘటనలను మీడియా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దంగల్ నటి ఫాతిమా సనా షేక్ కూడా తనపై సినిమా ఇండస్ట్రీలోని వేధింపులతో పాటు తనపై బయట జరిగిన దాడి గురించి కూడా గుర్తు చేసుకుంది.
ఓ సారి తాను జిమ్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఒకడు తనను ఫాలో అయ్యాడని.. ఎందుకు ఫాలో అవుతున్నావ్ అని అడిగితే నా ఇష్టం.. చూస్తా నీకెందుకు అని కరుకుగా సమాధానం చెప్పాడని తెలిపింది. కోపం వచ్చి అతని చెంప మీద కొడితే.. అతను కూడా తన మొహంపై గట్టిగా పంచ్ ఇచ్చాడని బాధపడింది. ఆ యువకుడు కొట్టిన దెబ్బతో కింద పడిపోయానని, ఆ తర్వాత లేచి నాన్నకు ఫోన్ చేసి చెప్పేలోపు అతడు పారిపోయాడని తెలిపింది. అది తన జీవితంలో మరిచిపోలేని చేదు సంఘటన అని చెప్పింది. ఇండస్ట్రీలోనూ తనకు చాలా చేదు సంఘటనలు ఎదురయ్యాయి అని చెప్పింది ఈమె.
ఇండస్ట్రీలో అవకాశాల కోసం తనను కొంతమంది దర్శకులు వేధించినట్లు ఫాతిమా సనా షేక్ తెలిపింది. చూడ్డానికి బాగున్నావ్ కానీ అవకాశం కావాలంటే తమతో పడుకోవాల్సిందేనని పలువురు దర్శకులు ఓపెన్‌గా అడిగేశారని చెప్పుకొచ్చింది. కుదరదని చెప్పినందుకు తనకు అవకాశాలు రాకుండా చేశారని, వచ్చిన అవకాశాలు కూడా పోగొట్టే ప్రయత్నం చేశారని చెప్పింది. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నానని తెలిపింది. ఈమె అమీర్ ఖాన్ దంగల్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అలాగే థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమాలోనూ నటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వామ్మో.. వకీల్ సాబ్ మినహా ఏప్రిల్‌లో అన్నీ ఫ్లాపులేనా
రానా మరో పాన్ ఇండియా ప్రాజెక్టు..అఫీషియల్!
జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న యంగ్ హీరో..!
తమిళ ఇండస్ట్రీకి కలిసి రాని 2021.. వరుస మరణాలతో షాక్‌లో ఫ్యాన్స్!
నిధి అగర్వాల్ సోయగం చూడతరమా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

