dakko dakko meka song | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఒక పోస్టర్‌పై కనిపిస్తే థియేటర్ బయట జనాలు డాన్స్ చేస్తారు. సుకుమార్, అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా పాటలు కూడా ఓ రేంజ్లో కంపోజ్ చేస్తున్నాడు డీఎస్పీ. ఈ క్రమంలోనే పుష్ప తొలి భాగం పుష్ప: ది రైజ్ లోని మొదటి పాటను ఆగస్టు 13 ఉదయం 11:07 నిమిషాలకు 5 భాషల్లో ఒకేసారి విడుదల చేశారు.
విడుదలైన మరుక్షణం నుంచే ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మేకోవర్ ఈ పాటలో హైలైట్‌గా నిలిచింది. నోటిలో కత్తి పెట్టుకొని దాక్కో దాక్కో మేక అంటూ ఐకాన్ స్టార్ చేసిన డాన్సులకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఐదు భాషల్లో ఐదుగురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడారు. తెలుగులో శివం.. హిందీలో విశాల్ దడ్లాని.. కన్నడంలో విజయ్ ప్రకాశ్.. మలయాళంలో రాహుల్ నంబియార్.. తమిళంలో బెన్నీ దయాల్.. దాక్కో దాక్కో మేక పాటను ఆలపించారు. ఈ పాట ఇప్పుడు 80 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అలాగే దాక్కో దాక్కో మేక పాటకు 1.65 మిలియన్ లైకులు కూడా వచ్చాయి.
వైల్డ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా దాక్కో దాక్కో మేక నిలిచిపోయింది. చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన నటిస్తుంది. రెండు భాగాలుగా పుష్ప సినిమా రానుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. క్రిస్మస్ సందర్భంగా ‘పుష్ప- ది రైజ్’ విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కల్యాణ్‌పై మరోసారి ఫైర్ అయిన పోసాని.. చిరంజీవిని పొగుడుతూనే..
మీరు నవ్వితే ప్రపంచం ఆగిపోతుంది..దీపికాపదుకొనే స్టిల్‌పై అభిమాని
తండ్రి, కొడుకుల మధ్య ముదురుతున్న వివాదం.. ఆందోళనలో విజయ్ ఫ్యాన్స్
మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్ అంతా నాకే ఓటేస్తారు: మంచు విష్ణు
పుష్ప టీమ్ సర్ప్రైజ్.. రష్మిక మందన్న ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది