బాలకృష్ణతో నటించడం ఓ గౌరవం
‘ఇందులో నా పేరు కావేరి. అభినయానికి ఆస్కారమున్న డీ గ్లామరస్ రోల్. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్ర. ఛాలెంజ్‌గా తీసుకొని చేశాను. దర్శకుడు బాబీ ఈ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారు.
‘ఇందులో నా పేరు కావేరి. అభినయానికి ఆస్కారమున్న డీ గ్లామరస్ రోల్. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్ర. ఛాలెంజ్‌గా తీసుకొని చేశాను. దర్శకుడు బాబీ ఈ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారు.’ అని కథానాయిక ప్రగ్య జైస్వాల్ తెలిపారు. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమాలో వన్ ఆఫ్‌ది హీరోయిన్గా నటించింది ప్రగ్యా జైస్వాల్. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ప్రగ్యా విలేకరులతో ముచ్చటించింది.
‘బాలకృష్ణగారితో వరుసగా సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా. ‘అఖండ’తో నా కెరీర్ మలుపు తిరిగింది. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ లాంటి గొప్ప సినిమాలో మళ్లీ ఆయనతో కలిసి నటించే భాగ్యం దొరికింది’ అంటూ ఆనందం వెలిబుచ్చింది ప్రగ్య జైస్వాల్. దర్శకుడు బాబీ ఈ కథ చెప్పినప్పుడే పెద్ద హిట్ అవుతుందని నమ్మానని, నిర్మాత నాగవంశీ పాషన్‌తో సినిమా నిర్మించారని ప్రగ్య పేర్కొన్నారు. జనవరి 12 తన పుట్టినరోజు అని, అదేరోజు ‘డాకు మహారాజ్’ విడుదల అవుతుండటం సంతోషంగా ఉందని ప్రగ్యా జైస్వాల్ పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anna Konidala | పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. ఇన్స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేసిన అన్నా
Shaji Kumar | మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత!
Vijay Sethupathi | వరుస సినిమాలతో విజయ్ సేతుపతి బాక్సాఫీస్ దండయాత్ర.. రెండు నెలల్లో రెండు చిత్రాలు..!
Scene Movie | సీన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రూ. 150 కోట్లు దాటిన సూర్య సినిమా!
Ramayana | 5 రోజుల్లో రూ. 663 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘రామాయణం’!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

