ఉగ్ర నరసింహ
నందమూరి అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తున్న సినిమా ‘డాకు మహారాజ్'. నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడు. సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
నందమూరి అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తున్న సినిమా ‘డాకు మహారాజ్’. నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడు. సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టైటిల్‌నూ, ప్రచార చిత్రాలను ఇటీవలే విడుదల చేశారు. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్‌ని కూడా మేకర్స్ మొదలుపెట్టారు.
‘ది రేజ్ ఆఫ్ డాకు..’ పేరుతో తొలి గీతాన్ని శనివారం విడుదల చేశారు. హీరో పాత్రను ఎస్టాబ్లిష్ చేసేలా అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను తమన్ స్వరపరచగా, భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి.రావు, కె.ప్రణతి ఆలపించారు. “డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా..’ అనే పవర్ఫుల్ పంక్తులతో అనంతశ్రీరామ్ ఈ పాటను రాశారని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ వీడియోలో మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో బాలకృష్ణ కనిపిస్తున్నారు. విజువల్స్‌లో భారీ తనం కనిపిస్తున్నది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

