Currency Nagar | యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కరెన్సీ నగర్ (Currency Nagar). ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 29న థియేటర్స్ లో విడుదల కాబోతోంది.
డబ్బు చుట్టూ తిరిగే కథగా కరెన్సీ నగర్ సినిమా నేపథ్యం ఉంటుంది. డబ్బుకు మనిషికి ఉన్న సంబంధాన్ని దర్శకుడు వెన్నెల కుమార్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ పాయింట్ అన్ని వర్గాల ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రాన్ని
ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర నటీనటులు :
యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ తదితరులు.
సాంకేతిక నిపుణులు :
బ్యానర్: ఉన్నతి ఆర్ట్స్
నిర్మాతలు: ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీధర్ గుడ్లూరు
దర్శకత్వం: వెన్నెల కుమార్ పోతేపల్లి
సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని, పవన్
ఎడిటర్: కార్తిక్ కట్స్
సినిమాటోగ్రఫీ: సతీష్ రాజబోయిన
సౌండ్ ఎఫెక్ట్స్: యతిరాజు