Dhanush | ధనుష్ హిందీ సినిమా అప్డేట్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
ధనుష్ (Dhanush) ప్రస్తుతం పాన్ ఇండియా కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ (Captain Miller)లో నటిస్తున్నాడు. తాజాగా ధనుష్ హిందీ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో మరోసారి చేయబోయే సినిమా తాజాగా వార్తల్లో నిలిచింది.
Dhanush | ఈ ఏడాది సార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) . ఈ స్టార్ హీరో సినిమా సినిమాకు కొత్త కొత్త ప్రయోగం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం పాన్ ఇండియా కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ (Captain Miller)లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ధనుష్ హిందీ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో మరోసారి చేయబోయే సినిమా తాజాగా వార్తల్లో నిలిచింది.
రాంఝానా, అట్రాంగి రే సినిమాల తర్వాత ఆనంద్ ఎల్ రాయ్ (Aanand L Rai), ధనుష్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడం విశేషం. ఇటీవలే ఈ సినిమా కోసం ముంబైలో ధనుష్ స్క్రీన్ టెస్ట్ పూర్తయిందట. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఇతర వివరాలపై అధికారిక ప్రకటన ఏమీ రాకున్నా.. రానున్న రోజుల్లో కొత్త అప్డేట్స్ వస్తాయని అనుకుంటున్నారు మూవీ లవర్స్. మరి ధనుష్ అప్‌కమింగ్ డేస్‌లో ఏదైనా అప్డేట్ ఇస్తాడేమో చూడాలి.
కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్‌ను జూన్‌లో, టీజర్‌ను జులైలో లాంఛ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని లీడింగ్ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తుంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

