Writer Padmabhushan Movie | ఒకప్పుడు పరభాష సినిమాల నుంచి సీన్లు గానీ, మూల కథ గానీ కాపీ కొట్టినా పెద్దగా తెలిసేది కాదు. ఒకవేళ తెలిసినా అప్పటికే ఆ సినిమా థియేటర్లలో నుండి వెళ్లిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఓటీటీల పుణ్యమా అని ఈ మధ్య కాలంలో భాషతో సంబంధంలేకుండా అన్ని సినిమాలను ప్రేక్షకులు చూసేస్తున్నారు. రిలీజవటమే లేటు ఏ భాష అన్నది కూడా పట్టించుకోవడం లేదు. ఎంచక్కా సబ్‌టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు. దాంతో ఇప్పుడు ఏ సినిమా నుంచి సీన్లు కాపీ చేసిన ప్రేక్షకులు ఇట్టే కనిపెట్టేస్తున్నారు. కాగా తాజాగా బుల్లెట్ ట్రైన్ స్పీడ్‌లో దూసుకుపోతున్న ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాపై కాపీ మరకలు అంటాయి.
సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి తొలివారం రిలీజైంది. విడుదలకు ముందు చేసిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ అయింది. పైగా సినిమాకు తొలిరోజే పాజిటీవ్ టాక్ రావడంతో పోటీగా ‘మైఖేల్’ వంటి పాన్ ఇండియా సినిమా ఉన్నా.. ప్రేక్షకులు ఈ సినిమాకే ఓటేశారు. అంతేకాకుండా మహిళలకు ఉచితంగా షోలో వేయడంతో జనాల్లోకి సినిమా దూసుకుపోయింది. ప్రతీరోజు కోటీగా పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా ఇటీవలే చిత్రయూనిట్ మొత్తం మహేష్‌ను కలవడం, సినిమా చూసి మహేష్ టీమ్‌ను అభినందించడం కూడా రైటర్‌కు బాగా కలిసి వచ్చింది.
అంతా బాగానే జరుగుతుంది అనుకుంటున్న సమయంలో ఈ సినిమాకు కాపీ మరకలు అంటుకున్నాయి. ఆరేళ్ల క్రీతం బాలీవుడ్లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘బరేలికి బర్ఫీ’ సినిమాను పోలివుందని ఈ సినిమా యూనిట్ రైటర్‌పై కాపీ మరకలు అంటించింది. కథలో మేయిన్ పాయింట్, కొన్ని సీన్లు కాపీ చేశారని ఆరోపణలు చేసింది. మూల కథని కాస్త అటు ఇటుగా మార్చారని, కానీ అసలు పాయింట్ మాత్రం అదేనని బరేలికి బర్ఫీ యూనిట్ అభిప్రాయపడింది. అయితే దీనిపై రైటర్ టీమ్ ఇప్పటివరకు స్పందించలేదు. చూడాలి మరీ ఈ కాపీ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో అని.