CM Revanth Reddy | డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలి.. చిరంజీవిని అభినందిస్తున్నా : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో నేరాలను ఎదుర్కోవడంలో సైబర్ క్రైం టీమ్ సమర్ధవంతంగా పని చేస్తోందని.. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy) అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్ అని అన్నారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో నేరాలను ఎదుర్కోవడంలో సైబర్ క్రైం టీమ్ సమర్ధవంతంగా పని చేస్తోందని.. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం ప్రభుత్వ బాధ్యత. అందుకే పోలీస్ వ్యవస్థకు కావాల్సిన నిధులు, అధికారులను కేటాయించాం. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్ అని అన్నారు.
డ్రగ్స్ మహమ్మారితో కుటుంబం, వ్యవస్థ నాశనమవుతాయి. దురదృష్టవశాత్తు గల్లీ గల్లీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగింది. డ్రగ్స్ నియంత్రణకు సిబ్బందిని కేటాయించామని.. గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్నారులపై జరుగుతున్న దాష్టీకాలకు కారణం మాదకద్రవ్యాలే.. తెలంగాణ యువకులు డ్రగ్స్ కు బానిసలు కాదు.. సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలని సీఎం కోరారు. డ్రగ్స్ నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేసినవారికి పదోన్నతి కల్పిస్తాం. ఇందుకు సంబంధించి శాసనసభలో చర్చించి చట్టాన్ని రూపొందిస్తాం. మీడియా సమాజంలో సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇలాంటి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.
డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తున్నా. ప్రతీ సినిమా విడుదల సందర్భంలో అదే నటీనటులతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా షార్ట్ వీడియో చేయాలి. ప్రతీ సినిమా థియేటర్లో సినిమా స్క్రీనింగ్‌కు ముందు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్‌కు సంబంధించి వీడియో ఉచితంగా ప్రదర్శించేలా చూడాలి. ఈ నిబంధనలకు సహకరించినవారికే అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుంది. సమాజాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత సినీ పరిశ్రమపై ఉంది. తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే.. నేరగాళ్లకు కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

