Circus Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘రామ్లీల’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావతి’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. గతేడాది ఈయన నటించిన ’83’ రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్ల పరంగా ఫేయిల్యూర్గా మిగిలింది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గొప్ప ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం ఈయన సర్కస్ అనే పీరియాడిక్ కామెడీ సినిమా చేస్తున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు.
ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని టీ సరిస్ ఫిలింస్, రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్తో కలిసి రోహిత్ శెట్టి స్వీయ నిర్మాణంలో రూపొందించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో రణ్వీర్కు జోడీగా పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్లు నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్వీర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.