అమ్మ, నాన్న తర్వాత ఆ స్థానాన్ని గురువుకే ఇచ్చారు మన పెద్దలు. గురువుని దైవంగా పూజించే సంప్రదాయం మన భారతదేశంలో ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 05 న గురు పూజోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ప్రతి మనిషికి మంచి, చెడు, విద్యాబుద్దులు, విలువలు నేర్పి ఓ ఉత్తమమైన స్థానంలో నిలబెట్టడంలో గురువు పాత్ర వెలకట్టలేనిది . గురు పూజోత్సవం సందర్భంగా చిరు, మహేష్, బాలయ్య శుభాకాంక్షలు తెలియజేశారు.
జ్ఞానాన్ని ప్రసాదించే వారు గురువు… మన జీవితానికి మార్గదర్శి గురువు …తప్పొప్పులు సరిదిద్ది సరైన మార్గంలో నడిపే మహోన్నత వ్యక్తి గురువు… గురు పూజోత్సవం సందర్భంగా నా మొదటి గురువులకు పాదాభివందనాలు అంటూ తన తల్లిదండ్రులు ఫోటో షేర్ చేశారు బాలకృష్ణ.
ఇక మహేష్ బాబు తన గురువు తన తండ్రే అని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రేమించడం, క్రమ శిక్షణతో ఉండడం, జాలి, వినయం నాన్న నాకు నేర్పించారు. అతనికి, నా ప్రయాణంలో ఎన్నో నేర్చుకోవడానికి సాయపడ్డ ప్రతి ఒక్కరికి, మార్గదర్శకులకి ఎల్లపడి రుణపడి ఉంటాను. టీచర్స్ డే శుభాకాంక్షలు అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
మన జీవితంలోని ప్రతి దశలో మనకు ఉపాధ్యాయుడు ఉంటాడు. జ్ఞానాన్ని అందించడం అన్ని వృత్తులలో కన్నాగొప్పది. ప్రపంచంలోని ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు అంటూ చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.