Mega 158 | “టైమ్ వచ్చినప్పుడు నేనే లీక్ చేస్తా”.. మెగా 158పై చిరంజీవి ఫన్ కామెంట్ వైరల్
Mega 158 | మెగాస్టార్ చిరంజీవ హీరోగా మాస్ దర్శకుడు కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం "మెగా 158" అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Mega 158 | మెగాస్టార్ చిరంజీవ హీరోగా మాస్ దర్శకుడు కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం “మెగా 158” అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిత్ర ప్రారంభోత్సవం అనంతరం మూవీ టీమ్ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. “ది స్పిరిట్ ఆఫ్ మెగా 158” పేరుతో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఇందులో చిరంజీవి చేసిన సరదా వ్యాఖ్యలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
వీడియోలో సినిమా టైటిల్ గురించి ఆసక్తికర సన్నివేశాన్ని చూపించారు. టైటిల్‌ను చిరంజీవి చెప్పబోతుండగా దర్శకుడు బాబీ ఆయనను ఆపేస్తూ “ఇప్పుడే చెప్పొద్దు” అని పక్కకు తీసుకెళ్లినట్లు చూపించారు. అనంతరం చిరంజీవి తనదైన స్టైల్లో స్పందిస్తూ, “పిచ్చోళ్లు.. వాళ్లు చెప్పొద్దంటే ఆగిపోతామని అనుకుంటున్నారు. టైమ్ వచ్చినప్పుడు నేనే లీక్ చేస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి.. సూపర్ టైటిల్” అని చెప్పడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఈ చిన్న డైలాగ్‌తోనే సినిమా టైటిల్‌పై మరింత చర్చ మొదలైంది. అసలు మెగా 158కి ఎలాంటి పేరు పెడతారనే అంశంపై అభిమానులు సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలుపెట్టారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. ఇక చిరంజీవి – బాబీ కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాబీ గత చిత్రాల్లో చూపించిన మాస్ ఎలిమెంట్స్, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఈ సినిమాను మరో భారీ కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

