Chiranjeevi | దసరా టీమ్‌కు మెగా అభినందనలు
Dasara Movie | దసరా జోరు ఇంకా కొనసాగుతుంది. సినిమా వచ్చి రెండు వారాలవుతున్న ఇంకా టిక్కెట్లు వేలలో తెగుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని నాని ఎదురు చూస్తున్న కమర్షియల్ బ్రేక్ దసరాతో వచ్చేసింది. గతనెల 30న భారీ అంచనాల నడుము విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచి కలెక్షన్ల వేట కొనసాగించింది.
Dasara Movie | దసరా జోరు ఇంకా కొనసాగుతుంది. సినిమా వచ్చి రెండు వారాలవుతున్న ఇంకా టిక్కెట్లు వేలలో తెగుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని నాని ఎదురు చూస్తున్న కమర్షియల్ బ్రేక్ దసరాతో వచ్చేసింది. గతనెల 30న భారీ అంచనాల నడుము విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచి కలెక్షన్ల వేట కొనసాగించింది. తొలివీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. కేవలం ఆరు రోజుల్లోనే వంద కోట్ల విజయ కేతనం ఎగరవేసింది. శ్రీకాంత్ టేకింగ్, నానీ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. కాగా తాజాగా ఈ సినిమాను చిరంజీవి వీక్షించాడు. అనంతరం చిత్రబృందం అభినందించాడు. సినిమా చాలా గొప్పగా ఉందంటూ ట్వీట్ చేశాడు.
దసరా చూశాను, అద్భుతంగా ఉంది. నాని పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. ఇది దర్శకుడు శ్రీకాంత్ మొదటి సినిమాని తెలిసి ఆశ్చర్యపోయాను. అతని నైపుణ్యాన్ని ఖచ్చితంగా అప్రిసియేట్ చేయాల్సింది. మహానటి కీర్తి సురేష్ జస్ట్ వావ్, దీక్షిత్ శెట్టి కూడా అద్భుతంగా నటించాడు. సంతోష్ నారాయణన్ సంగీతం వేరే లెవల్. దసరా టీమ్ మొత్తానికి అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు. ఇలా మెగా స్టార్ నుంచి విషెస్ రావడం దసరాకు కొత్త ఊపునిస్తాయి. ఇక మూడో వారంలోనూ దసరా చాలా సెంటర్స్ లో బలమైన రన్ కొనసాగిస్తుంది. గతవారం విడుదలైన రావణాసుర, మీటర్ సినిమాల ప్రభావం దసరాపై ఏ మాత్రం పడలేదు. ఇక శుక్రవారం శాకుంతలంతో పాటు రుద్రుడు సినిమా కూడా రిలీజవుతుంది. ఆ మరుసటి రోజు వెట్రిమారన్ విడుదల సినిమా రిలీజ్ కాబోతుంది. దాంతో దసరాకు థియేటర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది.
Kudos to the entire team of ‘DASARA’🥰@NameisNani @odela_srikanth @KeerthyOfficial @Dheekshiths@Music_Santosh pic.twitter.com/CciJqkcwrv
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

