మెగాస్టార్ చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ సినిమాలు యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి.. ఈ మూడు అభిమానుల్ని అలరించిన సినిమాలే. త్వరలో ఆయన నుంచి నాలుగో ఫాంటసీ సినిమా రానుంది. పంచభూతాల నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని చిరంజీవి పుట్టినరోజున విడుదల చేసిన పోస్టర్ ద్వారా దర్శకుడు వశిష్ట చెప్పకనే చెప్పాడు.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులకు దర్శకుడు శ్రీకారం చుట్టాడు. ‘త్వరలో మీ అందరినీ సినిమాటిక్ అడ్వెంచర్‌కు తీసుకెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు దర్శకుడు వశిష్ఠ. చిరంజీవి 157వ సినిమాగా భారీ వ్యయంతో తెరకెక్కనున్న ఈ ఫాంటసీ అడ్వెంచరస్ మూవీని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు.