Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వయసు పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్‌గా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. 70 ఏళ్ల వయసులోనూ అదే ఎనర్జీ, అదే గ్లామర్‌తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు చిరు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఆయన సినిమా భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. దాదాపు రూ.400 కోట్ల వసూళ్లతో మెగాస్టార్ మరోసారి తన స్టార్‌డమ్‌ను నిరూపించుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చిర నటిస్తుండగా, ఈ సినిమా కోసం చిరంజీవి పూర్తిగా కొత్త మేకోవర్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు దీనికి నిదర్శనంగా మారాయి.
లేత తెలుపు రంగు పోలో షర్ట్‌లో చిరంజీవి ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. స్లిమ్ ఫిట్ లుక్, యంగ్ స్టైల్‌తో ఆయన తన వయసులో సగం ఉన్నట్లుగా కనిపిస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు “చిరంజీవి వయసు రివర్స్‌లో వెళ్తుందా?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవి ఫిట్నెస్ వెనుక ఉన్న క్రమశిక్షణ కూడా ప్రత్యేకమే. ఆయన దృష్టిలో ఫిట్నెస్ అంటే కేవలం శారీరక దృఢత్వం మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యమని భావిస్తారు. అందుకే ఎప్పుడూ స్ట్రెస్ ఫ్రీగా, ప్రశాంతంగా కనిపిస్తుంటారు. ఆహారపు అలవాట్ల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎక్కువగా వెజిటేరియన్ హై ప్రోటీన్ ఫుడ్, సలాడ్స్, సూప్స్ తీసుకుంటారని సమాచారం. షూటింగ్ ఎక్కడ ఉన్నా ఇంటి నుంచే భోజనం తెప్పించుకోవడం ఆయన అలవాటు.
అలాగే ప్రతిరోజూ వర్కవుట్స్, యోగా, ప్రాణాయామం తప్పకుండా చేస్తుంటారు. ఉదయం 4 గంటలకే లేచి రెండు గంటల పాటు వ్యాయామం చేసిన తర్వాతే ఇతర పనుల్లో పాల్గొంటారని సినీ వర్గాలు చెబుతున్నాయి. పాత్రకు తగ్గట్లుగా తనను తాను మార్చుకోవడంలో చిరంజీవి ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు.ఇక బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించే అవకాశమున్నట్లు ఫిలింనగర్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, అభిమానులు మెగాస్టార్ స్టైల్, ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.