చిరంజీవి (Chiranjeevi) బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. ఇప్పటికే రీమేక్ సినిమాల షూటింగ్స్ తో తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు చిరు. ఈ స్టార్ హీరో మరో క్రేజీ రీమేక్‌పై కన్నేశాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, వేదాళమ్ రీమేక్ భోళా శంకర్ లను సెట్స్ పైకి తీసుకెళ్లిన చిరు..మలయాళ హిట్ ప్రాజెక్టు బ్రో డాడీ (Bro Daddy) రీమేక్‌లో నటించనున్నాడని ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.
ఇంతకీ ఒకవేళ ఈ మూవీ చేస్తే డైరెక్టర్ ఎవరనే కదా మీ డౌటు. పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమా చేసిన హరీష్ శంకర్ (Harish Shankar) ఈ క్రేజీ సినిమాను రీమేక్ చేస్తాడని జోరుగా ప్రచారం నడుస్తోంది. హరీష్ శంకర్ ఇప్పటికే పవన్ తో భవదీయుడు భగత్ సింగ్ (Bhavdeeyudu Bhagath Singh )సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అన్నీ కుదిరి మెగా కాంపౌండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే..పవన్ మూవీ తర్వాత చిరంజీవి రీమేక్‌ను పట్టాలెక్కించనున్నాడట.
చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ (Godfather )షూటింగ్లో పాల్గొంటున్నాడు. సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్టులో కీ రోల్ చేస్తుండగా..ముంబైలో వేసిన సెట్స్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో వచ్చిన బ్రో డాడీలో మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించారు.