మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘కాకా’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తుండగా, తాజాగా ఈ లిస్ట్‌లో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చేరారు. ఇటీవలే చిరంజీవితో కార్తీక్ సుబ్బరాజ్ భేటీ అయి కథ వినిపించినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌పై చిరంజీవి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.
పిజ్జా, జిగర్తాండ, పేట, మహాన్తో పాటు ఇటీవల విడుదలైన ‘డోరతి’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. దీంతో చిరు-కార్తీక్‌సుబ్బరాజ్ కాంబినేషన్ సినిమా వార్తలపై ఆసక్తినెలకొంది. మరోవైపు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి చేయాల్సిన సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా మెగాస్టార్‌కి కథ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పుడీ జాబితాలో కార్తీక్ సుబ్బరాజ్ సినిమా చేరింది.