మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే. మోహర్రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకాలపై ఎన్వీప్రసాద్, ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘గాడ్‌ఫాదర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మాఫియా, రాజకీయ అంశాలు, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో చిరంజీవి శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. చిరంజీవిపై పోరాటఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.