Chiranjeevi | స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదలైన తర్వాత మంచి స్పందనను అందుకుంటోంది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం అనంతరం సమంత నటించిన తొలి సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సమంత, రాజ్ నిడిమోరు దంపతులతో పాటు దర్శకురాలు నందిని రెడ్డి, చిత్ర యూనిట్ సభ్యులను తన నివాసానికి ఆహ్వానించిన ఆయన, సినిమా విజయంపై శుభాకాంక్షలు తెలిపారు.
సినిమా చూసిన అనంతరం చిరంజీవి తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, మా ఇంటి బంగారం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అని పేర్కొన్నారు. అలాగే సమంత నటనను ప్రత్యేకంగా ప్రశంసించిన ఆయన, సమంత నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చీరకట్టులో ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇటువంటి మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరం. ఈ విజయానికి సమంత, నందిని రెడ్డి, రాజ్ మరియు మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు.
మరోవైపు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత, రాజ్ దంపతులకు ప్రత్యేక అభినందనలు అని ఆయన పేర్కొన్నారు. ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ముఖ్యంగా “కొత్త అధ్యాయం” అనే పదం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీనిపై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సమంత ప్రగ్నెన్సీ విషయంలో చిరు ఈ కామెంట్ చేశారా అని పలువురు ముచ్చటించుకుంటున్నారు. ఇక జూన్ 19న విడుదలైన ‘మా ఇంటి బంగారం’ మొదటి రోజునుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ముఖ్యంగా సమంత నటన, భావోద్వేగ సన్నివేశాలు, కుటుంబ నేపథ్యం, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
“మా ఇంటి బంగారం“ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. @Samanthaprabhu2 నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.… pic.twitter.com/eE5xemjh3c
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 23, 2026