Godfather | గాడ్ ఫాదర్ మలయాళంలో రిలీజవుతుందా..? చిరంజీవి క్లారిటీ
మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వస్తోంది గాడ్ ఫాదర్ (Godfather). మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి..గాడ్‌ఫాదర్‌గా తెలుగులో వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వస్తోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి..రికార్డుల వర్షం కురిపించింది లూసిఫర్. కాగా ఇపుడు గాడ్‌ఫాదర్‌గా తెలుగులో వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
అయితే ఈ మూవీ తెలుగుతోపాటు మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారని ఇప్పటికే వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి. లూసిఫర్ కంటే గాడ్‌ఫాదర్ డిఫరెంట్‌గా ఉండనుందని, మలయాళంలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని డైరెక్టర్ మోహన్ రాజా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా మరికొన్ని గంటల్లో గాడ్‌ఫాదర్ థియేటర్లలో సందడి చేయనుంది.
ఇప్పటికే చిరంజీవి అండ్ టీం ప్రచార కార్యక్రమాల్లో ఉంది. నేడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో విడుదల విషయంపై క్లారిటీ ఇచ్చాడు చిరు. మలయాళంలో విడుదల కావడం లేదని, తెలుగు రిలీజ్ అయిన తర్వాత వారం రోజులకు తమిళంలో రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లు సంయుక్తంగా గాడ్ ఫాదర్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Also : Hari Hara Veera Mallu | స్పీడు పెంచిన క్రిష్..‘హరిహర వీరమల్లు’పై తాజా అప్డేట్
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

