Chhava| ఛావా సరికొత్త రికార్డ్.. ఏకంగా పుష్ప2,బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసిందిగా..!
Chhava| ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీని ముద్దుగా ఛావా అని పిలిచేవారు. ఛావా అంటే సింహం పిల్ల అని అర్ధం కాగా, శివాజీ సింహం అయితే.. ఆయన
Chhava| ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీని ముద్దుగా ఛావా అని పిలిచేవారు. ఛావా అంటే సింహం పిల్ల అని అర్ధం కాగా, శివాజీ సింహం అయితే.. ఆయన కుమారుడు సింహం పిల్ల ‘ఛావా’ అని పేరు. అయితే ఛావా ఒక పేరు కాదు, ఒక ఎమోషన్. ఛావా పేరుతో బాలీవుడ్లో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్లో రికార్డులు చెరిపేస్తుంది. చారిత్రక చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. హిందీలో విడుదలైన మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైన తర్వాత కూడా ఈ మూవీకి జనాలు నీరాజనాలు పలుకుతున్నారు.
వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వారాంతం వస్తే చాలు ఈ మూవీకి జనాలు క్యూ కడుతున్నారు. ఆలస్యంగా రిలీజైనప్పటికీ ఛావా తెలుగు వెర్షన్ పదిహేను కోట్లను దాటేసింది. ఒకవేళ కోర్ట్ కనక దూకుడుగా లేకపోయి ఉంటే ఛావా సినిమా పాతిక కోట్లు సులువుగా లాగించేది.ఇప్పటి వరకు ఈ చిత్రం 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా, ఐదో వీకెండ్లో మరో 22 కోట్లు జోడించుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఐదో వీకెండ్లో దూసుకుపోతున్న ఛావా ‘పుష్ప 2’ పేరిట ఉన్న రికార్డ్‌ని బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 చిత్రం ఐదో వీకెండ్లో 14 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే రికార్డును ఛావా దాటేసింది.
బాహుబలి 2 విషయానికి వస్తే ఈ మూవీ ఐదో వీకెండ్లోనూ అదరగొట్టి అప్పట్లో 8.5 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. మరోవైపు ఇదే లిస్ట్‌లో ‘స్ట్రీ 2’ కూడా ఉంది. ఈ చిత్రం ఐదో వీకెండ్లో 16 కోట్ల వసూళ్లు సాధించి మంచి హిట్‌గా నిలిచింది. మొత్తంగా చూస్తే, హిందీ మార్కెట్లో ఐదో వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలలో ఛావా రూ.22 కోట్లుతో తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో స్త్రీ 2 -16 కోట్లు మూడో స్థానంలో పుష్ప 2: ది రూల్ – 14 కోట్లు , నాలుగో స్థానంలో యూరి – 12.50 కోట్లు ఐదో స్థానంలో బాహుబలి 2 – 8.5 కోట్లు నిలిచాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
Priya Bhavani Shankar | ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రియా భవాని
RTC Bus Pass | బస్‌పాస్ జారీలో గందరగోళం.. ఇష్టానుసారంగా బస్ పాస్‌లు జారీ చేస్తున్న ఆర్టీసీ
Kamal Haasan | టైటిల్ వివాదంలో ‘సండియర్’.. గతంలో విరుమాండి’గా పేరు మార్పు..!
Ramayana Movie | ఆస్కార్ బరిలో ‘రామాయణ’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

