Kurra Productions | చంద్రహాస్ కోట్ల హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా పూజా కార్యక్రమాలు!
Chandrahas Kotla | యువ నటుడు చంద్రహాస్ కోట్ల హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కుర్ర ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 3గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కే. రాఘవేంద్ర రెడ్డి సమర్పిస్తుండగా, దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు. విభిన్న కథాంశాలతో చిత్రాలను తెరకెక్కించే ప్రతిభావంతులైన దర్శకుడు చెందు ముద్దు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Chandrahas Kotla | యువ నటుడు చంద్రహాస్ కోట్ల హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కుర్ర ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 3గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కే. రాఘవేంద్ర రెడ్డి సమర్పిస్తుండగా, దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు. విభిన్న కథాంశాలతో చిత్రాలను తెరకెక్కించే ప్రతిభావంతులైన దర్శకుడు చెందు ముద్దు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సినీ పరిశ్రమకు గుండెకాయ లాంటి ఫిల్మ్ నగర్‌లోని ప్రసిద్ధ శ్రీ సాయిబాబా ఆలయంలో ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రెరా మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ క్లాప్ కొట్టగా.. గంగరాజు కాకర్ల, రంగారావు వేములపల్లి, సిరాజ్ ఎస్ఎం, మధుసూదన్ తదితరులు చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు. అలాగే దీపా ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్ గౌడ కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.
ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇంకా ఖరారు చేయలేదు. త్వరలోనే అధికారిక టైటిల్‌తో పాటు పూర్తి వివరాలను చిత్ర బృందం మీడియా ముందుకు తీసుకురానుంది. ఈ చిత్రానికి శివా రెడ్డి ఎస్వి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే మారుతీ రాజా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, సాయి సతీష్ పీఆర్ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

