Titles | టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. రెండు అక్షరాల టైటిల్స్ కోసం స్టార్ హీరోల పోటీ!
Titles | సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు, ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఒకప్పుడు హీరో పేరు, మరికొన్నిసార్లు కథకు సంబంధించిన పదం.. ఇలా రకరకాల ఫార్ములాలు సినిమా టైటిల్స్ విషయంలో ట్రెండ్ అయ్యాయి. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో మరో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండే రెండు అక్షరాల టైటిల్స్‌పై మేకర్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
Titles | సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు, ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఒకప్పుడు హీరో పేరు, మరికొన్నిసార్లు కథకు సంబంధించిన పదం.. ఇలా రకరకాల ఫార్ములాలు సినిమా టైటిల్స్ విషయంలో ట్రెండ్ అయ్యాయి. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో మరో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండే రెండు అక్షరాల టైటిల్స్‌పై మేకర్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సింపుల్‌గా ఉండటంతో పాటు ప్రేక్షకులకు ఈజీగా గుర్తుండిపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు చిన్న టైటిల్స్‌తోనే బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటడంతో.. ఇదే ఫార్ములాను పలువురు స్టార్ హీరోలు, దర్శకులు ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియా, డిజిటల్ ప్రమోషన్స్ పెరిగిన ఈ రోజుల్లో చిన్నగా, పవర్‌ఫుల్‌గా ఉండే టైటిల్స్ సినిమాకు మరింత గుర్తింపు తీసుకొస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.
రామ్ చరణ్–బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ టైటిల్ చాలా చిన్నదే అయినప్పటికీ సినిమాపై మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అలాగే లోకేష్ కనకరాజ్ హీరోగా తెరకెక్కిన ‘డీసీ’ కూడా షార్ట్ టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్లో కీలకమైన కంబ్యాక్ మూవీగా వచ్చిన ‘ఓజీ’ టైటిల్ కూడా రెండు అక్షరాల ఫార్ములాలోనే వచ్చింది. సినిమా విడుదలకు ముందే ఈ టైటిల్ అభిమానుల్లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ విజయంతో పవన్ కళ్యాణ్‌కు కూడా ఈ సినిమా మంచి ఊరటనిచ్చింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్‌ను పలువురు టాప్ హీరోల సినిమాలకు కూడా కొనసాగిస్తున్నారు. ప్రభాస్–హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మెగాస్టార్ చిరంజీవి–బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు కూడా ‘కాక’ అనే షార్ట్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు అల్లరి నరేష్ సహా పలువురు హీరోల సినిమాల విషయంలోనూ చిన్న, క్యాచీ టైటిల్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. దీంతో టాలీవుడ్లో షార్ట్ టైటిల్స్ ట్రెండ్ మరింత బలపడుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రానికి ‘రాకా’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అల్లు అర్జున్ సినిమా కావడంతో ఈ టైటిల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.అదే విధంగా గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘సింగ’ అనే చిన్న టైటిల్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలకు చిన్న టైటిల్స్ రావడం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కేవలం టైటిల్ చిన్నగా ఉన్నంత మాత్రాన సినిమా హిట్ అవుతుందని చెప్పలేం. కథ, కంటెంట్, హీరో ఇమేజ్, ప్రమోషన్, ప్రేక్షకుల స్పందన వంటి అంశాలే అసలు విజయాన్ని నిర్ణయిస్తాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

