రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఖిలాడీ’. రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నాయికలుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ నెల 11న విడుదల కానుంది. కోనేరు సత్యనారాయణ నిర్మాత. శనివారం ‘ఖిలాడీ’ సినిమా నుంచి ఐదో పాటను విడుదల చేశారు. క్యాచ్ మీ…అంటూ సాగే ఈ పాటను రవితేజ, డింపుల్ హయతి మీద చిత్రీకరించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ పాట సినిమాకు ఆకర్షణ అవుతుందని చిత్రబృందం తెలిపింది.