సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాలింగ్ సహస్ర’. అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించారు. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. డాలీషా కథానాయిక. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదల చేసిన టీజర్, రెండు పాటలకు మంచి స్పందన లభించింది. వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సుడిగాలి సుధీర్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది.
సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటుంది. సహస్ర ఎవరు? ఆమె వెనకున్న రహస్యమేమిటన్నది కథలో ఆసక్తికరమైన అంశంగా ఉంటుంది’ అన్నారు. శివ బాలాజీ, మనోహరన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సన్నీ.డి, సంగీతం: మోహిత్ రెహమానియక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్: మార్క్ కె రాబిన్, నిర్మాతలు: వెంకటేశ్వర్లు కాటూరి, విజేష్ తయల్, చిరంజీవి పమిడి, దర్శకత్వం: అరుణ్ విక్కిరాలా.