Nayanthara | దయచేసి నన్ను అలా పిలవొద్దు.. అభిమానులను వేడుకున్న నయనతార
‘మీ ప్రేమ నాకు చెప్పలేనంత సంతోషాన్నిస్తుంది. ఈ ఆనందం కలకాలం ఉండాలని కోరుకుంటున్నా. మీరు ప్రేమతో నన్ను ‘లేడీ సూపర్‌స్టార్' అని పిలుస్తున్నారు. అలా పిలవడం సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నప్పటికీ ఎందుకో కంఫర్ట్‌గా ఉండలేకపోతున్నా. అందుకే.. దయచేసి నన్ను ‘లేడీ సూపర్‌స్టార్' అని పిలవొద్దు.
Nayanthara | ‘మీ ప్రేమ నాకు చెప్పలేనంత సంతోషాన్నిస్తుంది. ఈ ఆనందం కలకాలం ఉండాలని కోరుకుంటున్నా. మీరు ప్రేమతో నన్ను ‘లేడీ సూపర్‌స్టార్’ అని పిలుస్తున్నారు. అలా పిలవడం సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నప్పటికీ ఎందుకో కంఫర్ట్‌గా ఉండలేకపోతున్నా. అందుకే.. దయచేసి నన్ను ‘లేడీ సూపర్‌స్టార్’ అని పిలవొద్దు. నయనతార అని పిలవండి చాలు’ అంటూ బహిరంగ లేఖ రాశారు అగ్ర నటి నయనతార. ఇటీవల ధనుష్‌తో గొడవ, కోర్టు కేసుల నేపథ్యంలో నయనతార వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమె నుంచి ఈ లేఖ రావడం చర్చనీయాంశమైంది.
ఇంకా ఆ లేఖలోకి వెళితే.. ‘నయనతార అనే పేరు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. అదే నేనెవరో నాకు చెబుతుంటుంది. బిరుదులు, పొగడ్తలు, ప్రశంసలు వెలకట్టలేనివే.. కాదనను. కానీ కొన్ని సార్లు అవి మనల్ని కంఫర్ట్‌గా ఉండనివ్వవ్. మీ అభిమానం ఉంటే చాలు. సినిమా మనందర్నీ ఒకటిగా ఉంచుతుంది. నయనతార మాత్రం ఎప్పటికీ నయనతారే.’ అని పేర్కొన్నారు నయన్. గతంలో హీరో అజిత్ కూడా తనను ‘తల’ అని పిలవొద్దని ఇలాగే స్టేట్మెంట్ ఇచ్చారు. కమల్‌హాసన్ కూడా అభిమానులకు తనను ‘ఉళగనాయగన్’ అని పిలవొద్దని చెప్పారు. ఇప్పుడు వారి క్లబ్‌లోకి నయనతార కూడా చేరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

