కొత్త అనుభూతినిస్తుంది
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బుట్ట బొమ్మ’. ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది.
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బుట్ట బొమ్మ’. ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు. ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలు తెలిపారు నటుడు అర్జున్ దాస్. ఆయన మాట్లాడుతూ…“ఖైదీ’, ‘అంధఘారం’, ‘మాస్టర్’ చిత్రాలతో నటుడిగా మంచి పేరొచ్చింది. ఇప్పుడు సితార సంస్థలో నటించడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నేను ఆర్కే అనే పాత్రలో కనిపిస్తాను. నిర్మాత వంశీ ఈ సినిమాలో నటించమని ఫోన్ చేశారు.
ఈ పాత్రకు నేనైతే బాగుంటుందని ఆయన నమ్మకం పెట్టుకున్నారు. దర్శకుడు రమేష్ చెన్నై వచ్చి కథ, నా పాత్ర గురించి చెప్పారు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టాను. ఇది రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మంచి మార్పులు చేశారు. ఇక్కడి నేటివిటీతో సినిమా ఆద్యంతం సాగుతుంది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. ఇప్పటిదాకా డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యాను. హైదరాబాద్, విశాఖ వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు నన్ను గుర్తుపట్టడం ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాలో నటించడం సంతృప్తిగా ఉంది. ఈ సినిమాలో నా పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. క్యారెక్టర్ కొత్తగా ఉంటే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధం. విలన్ పాత్రలైనా సరే అభ్యంతరం లేదు’. అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

