Bunny Vasu – Allu Arjun | టాలీవుడ్ అగ్ర నటుడు ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆయ్’. గోదావరి నేపథ్యంలో ఫుల్ కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం ఇండిపెండెన్స్ కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ వేడుకలో నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాకు అల్లు అర్జున్‌కు మధ్య గొడవలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. అలాంటివి నమ్మకండి అవి ఫేక్. అల్లు అర్జున్‌తో ఉన్న రిలేషన్ గురించి నాకు మాత్రమే తెలుసు. నాకు కష్టం వచ్చిందంటే ఇద్దరే నా ముందుంటారు. ఒకటి మా అమ్మ.. రెండో వ్యక్తి నా స్నేహితుడు బన్నీ. నేను ప్రాబ్లమ్‌లో ఉన్నానని చెప్పనక్కర్లేదు. ఒకవేళ నేను ప్రాబ్లమ్‌లో ఉంటే ఎక్కడ ఉన్నా నాకు అండగా వచ్చి గోడలా నిలబడతాడు. ఆయ్ సినిమా ప్రచారం కోసం.. బన్నీని పోస్ట్ పెట్టమని అడగాలని మా టీమ్ వాళ్లు కోరారు. కానీ నేను అడగలేదు. నేను సమాచారం ఇవ్వకుండానే ఆయనే తన ట్విటర్లో పోస్ట్ పెట్టారు. 20 ఏండ్ల క్రితం ఒక తప్పు చేసి గీతా ఆర్ట్స్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆరోజు నాకోసం తన తండ్రిని ఎదురించాడు. అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నాకే కాదు.. తన లైఫ్‌లో ఎవరు ప్రాబ్లమ్‌లో ఉన్నా బన్నీ సపోర్ట్‌గా నిలుస్తాడు. అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నా బాగుండాలి అంటూ బన్నీ వాసు చెప్పుకోచ్చాడు.
Bunny vasu about allu arjun anna ❤#Pushpa2TheRulepic.twitter.com/fdvX0eSgpf
— StylishstarAbhimani (@bunnyannacult22) August 13, 2024
Also Read..