Allu Arjun: టిఫిన్ అమ్మే వ్యక్తికి హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన బన్నీ..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత స్టైలిష్‌గా ఉంటారో, ఒక్కోసారి చాలా సింప్లిసిటీని కూడా మెయింటైన్ చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన పుష్ప సిపిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.ఈ షూటింగ్ కాకినాడతో పాటు మారేడుమిల్లి ప్రాంతంలో జరుపుకుంటుంది. ఈ చిత్ర షూటింగ్‌కి వర్షం వలన బ్రేక్ పడ్డట్టు తెలుస్తుంది. అయితే పుష్ప’ షూటింగ్ మధ్యలో లభించిన బ్రేక్ సమయంలో కాకినాడలోని థియేటర్లో ‘సీటీమార్’ చిత్రాన్ని అల్లు అర్జున్ వీక్షించారు.
ఇక గోకవరం సమీపంలో ఉన్న రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో బన్నీ టిఫిన్ చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియోలో వైరల్ కాగా, 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరో ఇంత సింపుల్‌గా ఉండటాన్ని చూసి అంతా షాక్ అయిపోయారు. ఆయన సింప్లిసిటీకి ఫిదా అయిపోయారు. అక్కడున్న వాళ్లకు బిల్‌తో పాటు భారీగా టిప్ కూడా ఇచ్చేసాడు అల్లు అర్జున్.
ఇక బన్నీ టిఫిన్ సెంటర్ యజమానితో మాట్లాడి అతని ఆర్ధిక పరిస్థితి తెలుసుకొని హైదరాబాద్ లో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడట. బన్నీ ఉదారతని చూసి అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో బన్నీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, బన్నీ నటిస్తున్న పుష్ప చిత్రం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, ఇందులో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తుంది. విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దాక్కో దాక్కో మేక పాట యూ ట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

