‘బబుల్గమ్’ చిత్రం ద్వారా తెలుగులో కథానాయికగా అరంగేట్రం చేస్తున్నది మానస చౌదరి. రోషన్ కనకాల హీరోగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మానస చౌదరి మాట్లాడుతూ ‘మోడలింగ్ రంగం ద్వారా నేను సినిమాల్లోకి ప్రవేశించాను. సినిమాల్లోకి వెళ్తానని చెప్పగానే మా ఫ్యామిలీ ఎంతగానో సపోర్ట్ చేశారు. ‘బబుల్గమ్’ కథ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఈ సినిమాలో నేను జాన్వి అనే పాత్రలో కనిపిస్తా.
తను ఫ్యాషన్ డిజైనర్. నా నిజ జీవితానికి కాస్త దగ్గరగా ఉండే పాత్ర ఇది. అందుకే ఫోటోషూట్ జరిగినప్పుడు నా లైఫ్‌కు సంబంధించిన కొన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కథలో బలమైన భావోద్వేగాలుంటాయి. తొలి చిత్రంలోనే అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర దక్కడం ఆనందంగా ఉంది. రోషన్ మంచి కోస్టార్. అతని ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నా. ప్రమోషన్స్ కోసం కాలేజీలకు వెళ్లినప్పుడు స్టూడెంట్ మా టీమ్‌ను చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. నటిగా అన్ని జోనర్స్లో నటించాలనుంది. ఇప్పుడే ప్రయాణాన్ని ఆరంభించాను కాబట్టి.. కథల ఎంపికలో ఎలాంటి నిబంధనలు విధించుకోలేదు’ అని చెప్పింది.