Bro Movie Songs | ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అంతా బ్రో మత్తులో మునిగిపోయారు. మరో పదమూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. పైగా మామఅల్లుళ్లు ఒకే సారి వెండితెరపై కనిపించనుండటంతో వీర లెవల్లో హైప్ ఏర్పడింది. పి. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో బిజీగా గడిపేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.
జానవులే నెరజానవులే అంటూ సాగే మెలోడియస్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. సాయిధరమ్, కేతికలు డ్యూయెట్ అదిరిపోయింది. థమన్ స్టైల్ ఆఫ్ ట్యూన్‌కు కాసర్ల శ్యామ్ సాహిత్యం ఫుల్ క్యాచీగా ఉంది. ఈ పాటను స్వయంగా థమన్ ఆలపించడం విశేషం. ఇప్పటికే రిలీజైన మై డియర్ మార్కెండేయ ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ సినిమాను పీపుల మీడియా బ్యానర్‌పై వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్నాడు.